Tuesday, May 21, 2019

తెలంగాణలో అరుదైన విగ్రహం...

వరంగల్‌ సమీపం లోని ధర్మసాగర్‌ మండలానికి చెందిన 'ముప్పవరం / ముప్పారం' అనే గ్రామంలో దేశంలోనే అతి ప్రాచీనమైన 'గాయత్రి సమేత పంచముఖ విశ్వకర్మ' విగ్రహాన్ని వరంగల్‌ కి చెందిన దంత వైద్యురాలైన ఈ వ్యాసరచయిత్రి కనుగొన్నది. చరిత్ర, పురావస్తుశాస్త్రం పట్ల మమకారం, ఆసక్తి ఉన్న ఆమె విషయ పరిజ్ఞానం ఉన్న పండితులతో చర్చించి రాసిన ఈ వ్యాసం భారత దేశంలోనే అరుదైన విశ్వకర్మ విగ్రహ లక్షణాల (ఐకనోగ్రఫీ)ను తెలియజేస్తున్నది. అట్లాగే అత్యంత ప్రాచీన భారతీయ సాహిత్య గ్రంథాలైన
వేదాల్లో ఉన్న విశ్వకర్మ ప్రస్తావనను తెలియజేయడమే కాక, భారతీయ కులవ్యవస్థలో ఒక మెట్టుగా ఉన్న విశ్వకర్మకులస్తుల జన్మవృత్తాంతంతో ఈ విశ్వకర్మకు ఉన్న సంబంధాన్నీ ఈ వ్యాసం చక్కగా వివరిస్తున్నది.


వరంగల్‌ జిల్లా ముప్పవరం గ్రామంలోని విశ్వకర్మ విగ్రహం కాకతీయుల కాలానికి చెందిన ఒక శైవ త్రికూటాలయం లో శిథిలావస్థ లో పడి ఉంది. ఇదే గ్రామంలోని ఉత్తరదిక్కున వున్న ఒక కొండ పై చెక్కిన శాసనం ప్రకారం - 'పెమ్ట బొల్లిరెడ్డి', 'కొమ్మసాని' సంతానమైన 'మల్లిరెడ్డి' అనే అతను కాకతీయ చక్రవర్తియైన 'గణపతిదేవ మహారాజు' (1199 - 1262) కాలములో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం మూలవిరాట్‌ పరమేశ్వరుని స్వరూపమైన 'రామేశ్వరదేవ' గా ఈ శాసనం లో పేర్కొనబడింది.
అద్భుతమైన శిల్పకళ తో కాకతీయ శైలిలో నిర్మించిన శైవ త్రికూటాలయం ఈ 'ముప్పవరం' ఆలయం. ఈ త్రికూటాలయం లో ఉన్న 3 ఆలయాలు కూడా శైవాలయాలు కావడం విశేషం. సాధారణంగా కాకతీయులు శివుడికి, విష్ణువుకి, సూర్యుడికి త్రికూటాలయాలు నిర్మించేవారు.
బ్రహ్మదేవుడి మాదిరిగానే విశ్వకర్మ కు కూడా మన దేశం లో ఆలయాలు చాలా తక్కువ. మన దేశం మొత్తం లో విశ్వకర్మ కి ఉన్న ఆలయాలు 17 మాత్రమే! అవి కూడా చాలా వరకు భారతదేశంలో ఉత్తర, తూర్పు భాగాల్లో మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ శిల్పాన్ని చాలా అరుదైన శిల్పంగాభావించవచ్చు.
 

విశ్వకర్మ రూపం :-
 
ఈ శిల్పం లో విశ్వకర్మ, 5 తలలు, 10 చేతులతో, గాయత్రీ సమేతుడై, హంస వాహనం పై 'పంచముఖ విశ్వకర్మ' రూపం లో ఆసీనులై ఉన్నాడు. తన వినూత్నమైన పనితనాన్ని చూపించాల నుకున్న కాకతీయ శిల్పి, ఒకే విగ్రహం లో 3 దైవ స్వరూపాలైన 'పంచముఖ బ్రహ్మ', 'సదాశివ', 'పంచముఖ విశ్వకర్మ' లని తలపించేలా తన ప్రతిభా-పాఠవాలన్నింటిని ఏకంచేసి ఎంతో నైపుణ్యం తో ఈ శిల్పాన్ని చెక్కారు. స్థపతులు నెమ్మికంటి నర్సయ్య చారి, గోపాల కృష్ణ; ప్రముఖ చిత్ర-శిల్పకారులు ఏలూరి శేషబ్రహ్మం ఈ అరుదైన విగ్రహం 'విశ్వకర్మ'దే అని ధృవీకరించారు.
విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ అనేది ఒక నమ్మకం. ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం ఆయనది. విశ్వకర్మ, ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము, 'పంచ శీర్షుడుగా' వర్ణించింది. ఋగ్వేదంలోని పదవ మండలం 81, 82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని వివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్‌ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా 'త్వష్ట' ను కూడా ఉపయోగిస్తారు.
''ప్రజాపతి విశ్వకర్మ మన్ణ'', అని కష్ణ యజుర్వేదమున , విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము అని 5 ముఖములు. మహర్షులు, కొన్ని సందర్భాలలో విశ్వకర్మను గాయత్రిగా, గాయత్రిని విశ్వకర్మగా సంబోధిస్తుంటారు. కావుననే, వారిరువురు ప్రక తి పురుష భిన్న రూపులేగాని ఏకంగా ప్రణవ స్వరూపులే అని భావిస్తారు. విరాట్‌ విశ్వకర్మ పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారని, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస) పంచార్షేయ బ్రాహ్మణులు (విశ్వబ్రాహ్మణులు) ఉద్భవించారని చెబుతారు.
ముప్పవరానికి చెందిన ఈ అరుదైన విశ్వకర్మ శిల్పం ఉన్న ఆలయం 13 వ శతాబ్దానికి చెందింది. అంటే సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. అంటే దేశం లొనే అతి ప్రాచీనమైనదిగా దీన్ని పరిగణించవచ్చన్నమాట. దేశంలోనే ఇంత అరుదైన, పురాతనమైన, విశ్వకర్మ విగ్రహం మన తెలంగాణ లో ఉండటం మనకెంతో గర్వ కారణం.
కాని, బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇంతటి ప్రాశస్త్యం ఉన్న 'ముప్పవరం' త్రికూటాలయం శిధిలావస్థ లో ఉంది. గుప్త నిధుల వేటకు బలైన ఆలయాలల్లో ఇదీ ఒకటి. ఇటు ప్రజాదరణకు, అటు ప్రభుత్వాదరణకు దూరమై ఆలయపు శిథిలాలు మౌనంగా విలపిస్తున్నాయి. ఇప్పటికైనా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్కియాలజీ శాఖలు స్పందించి, ఎంతో విశిష్టత ఉన్న ఈ ముప్పవరం ఆలయాన్ని రక్షిత కట్టడం (ప్రొటెక్టెడ్‌ మాన్యుమెంట్‌)గా ప్రకటించాలి. అప్పుడే ఈ అరుదైన ఆలయం పదికాలాలపాటు మనగలుగుతుంది.
                                                                                                        -డా. హిందోళ గుడిబోయిన
                                                                                              hindolagudiboina@gmail.com

Monday, May 13, 2019

326వ శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం...

శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విశ్వకర్మ సంఘం అడ్డగుట్ట సికింద్రాబాద్  
శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీమద్ విరాట్ విశ్వకర్మ దేవాలయం ఆడ్డగుట్ట సికింద్రాబాద్ లో సంఘం అధ్యక్షుడు శ్రీ వంగల బిక్షపతిచారి, శ్రీ కె. నారాయణ చారి ఉపాధ్యక్షుడు, శ్రీ ఎం. లక్ష్మణ్ చారి ప్రధాన కార్యదర్శి, శ్రీ ఎ. శంకర్ చారి, శ్రీ జె. బాలకృష్ణ, శ్రీ ఎం. సతీష్ చారి, శ్రీ ఎన్. విష్ణు చారి, సంఘం సభ్యులు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
విశ్వకర్మ సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంఘం తరుపున శుభాకాంక్షలు తెలిపారు.

SVBS_Aradhana 14-05-2019...


SVBS_Happy Aradhana...

Sunday, May 12, 2019

నేడు పది ఫలితాలు...

  1. 11.30 గంటలకఁ విడుదల
  2. ఫిర్యాదుల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌

పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ మేరకఁ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకఁలు బి సుధాకర్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకఁ హైదరాబాద్‌లోఁ సచివాలయంలో ఉన్న డిబ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారఁ తెలిపారు. పదో తరగతి ఫలితాలకఁ సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ (TSSSCBOARD APP) విద్యార్థులకఁ అందుబాటులోకి తెచ్చామఁ పేర్కొన్నారు. విద్యార్థులు స్టూడెంట్‌ గ్రీవెన్స్‌ బాక్స్‌ ద్వారా తమ ఫిర్యాదులను పంపించవచ్చఁ సూచించారు. హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేది వివరాలతో లాగిన్‌ కావొచ్చఁ తెలిపారు. మొబైల్‌ నెంబర్‌ పొందుపరచడం తప్పఁసరి అఁ పేర్కొన్నారు. ఈమెయిల్‌ ఐడీ ఉండాలఁ సూచించారు. ఫిర్యాదు ఏ రకమైందో ఎంపిక చేసుకొఁ వివరాలు నమోదు చేయాలఁ కోరారు. ఆ మొబైల్‌ నెంబర్‌కఁ ఫిర్యాదును స్వీకరించామనే సమాచారం వెళ్తుందఁ తెలిపారు. ఫిర్యాదు ఒకసారే పంపించడాఁకి అవకాశముంటుందఁ పేర్కొన్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకఁ పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 11,023 పాఠశాలల నుంచి 5,52,302 మంది విద్యార్థులు ఈ పరీక్షలకఁ హాజరయ్యారు.

ఫలితాలు తెలుసుకఁనే వెబ్‌సైట్లు



bse.telangana.gov.in
results.cgg.gov.in
www.navatelangana.com 

🌹🌷 శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన మహోత్సవము 🌹🌷

   14-5-2019 రోజున కడప జిల్లా, మైదుకూరు మండలం, *వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం* నందు జరుపబడును.
   14-5-2019 తేదీన *ఆరాధన* జరుగుతుంది.
    15-5-2019 తేదీన *రథోత్సవం* జరుగుతుంది. 
   16-5-2019 తేదీన *మహా ప్రసాదం* భక్తులకు అందజేయడం జరుగుతుంది.
    కనుక రెండు తెలుగు రాష్ట్రాల  భక్తులందరూ ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ కృపాకటాక్షములకు పాత్రులై తరింతురు గాక అని కోరుచున్నాము.

SVBS-Vishwarakma Sangham Logo...